ఘనంగా క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి
కర్నూలు:నగరంలో స్థానిక సంగోలి రాయన్న సేన కార్యాలయంలో భారత సైన్యధికారి, స్వాతంత్ర్యోద్యమకారుడు క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,సేన నాయకులు కురువ రంగస్వామి,కురువ మురళి మోహన్,మధుసూదన్ రాయ,కురువ లాలు, నాగలాపురం శ్రీనివాసులు,కురువ శివరాం,కురువ శివ లు పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగోలి రాయన్న 1798 ఆగస్టు 15న కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావిలోని సంగోలిలో జన్మించారని ఆయన కిత్తూరు రాచరిక రాష్ట్రంలో సైన్యంలో చేరి భారతదేశంలో బ్రిటీష్ పాలన కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారని 1830 ఏప్రిల్ నెలలో సంగోలి రాయన్నను బ్రిటీష్ వారు బంధించి 1831 జనవరి 26న ఉరితీసారని సంగోలి రాయన్న బ్రిటిష్ వారిపై చేసిన తిరుగుబాటు,దేశానికి అందించిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం చరిత్రక, పర్యాటక ,దర్శనీయ ప్రదేశాలకు సంగోలి రాయన్న పేరు పెట్టడమేగాక ప్రతి సంవత్సరం జయంతి,వర్థంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బాలింతలకు బ్రెడ్ పాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివ నారాయణ సుధాకర్,కురువ శివ, పెద్దపాడు శివ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.