
జెమ్ కెర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు….
కర్నూల్ న్యూస్ వెలుగు: నగరంలో కామినేని హాస్పిటల్ లో డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె ఆరోగ్యం కోసం కీలకమైన సూచనలను వివరించారు. అదు నాతన కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కారణం ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం వలన అధికమవుతున్నాయన్నారు. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాయామం ను ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు అయినా చేయాలన్నారు అంతే కాకుండా జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ విధంగా మనం గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు అన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. అందువలన కామినేని హాస్పిటల్ లో ప్రజల కోసం 3840 విలువగల గుండెకు సంబంధించిన పరీక్షలను కేవలం 699 రూపాయలకే ఆఫర్ గా పెట్టమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని మా హాస్పిటల్ నందు సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం చెరుకు రాఘవేంద్ర, సందీప్ కుమార్ కార్డియాలజీ డాక్టర్లు మాట్లాడుతూ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె అన్నారు కావున గుండె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు వ్యాయామం ను అలవాటు చేసుకోవాలన్నారు తప్పకుండా వారంలో కనీసం ఐదు రోజులు 30 – 45 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు ప్రతిరోజు పదివేల అడుగులు నడవాలన్నారు ఈ విధంగా గుండెను సంరక్షించుకోవచ్చు అన్నారు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలు అన్నీ మరియు బీపీ షుగర్ చెకప్స్ చేయించుకోవాలన్నారు ఈ విధంగా చేయించుకోవడం వలన ముందుగానే గుండెకు తగిన మందులను వాడవచ్చు అన్నారు దీని ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చున్నారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లకు శాలువలతో సన్మానించడం జరిగింది. తర్వాత కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు రవిబాబు, బాల మురళీకృష్ణ, రామ్మోహన్ రెడ్డి, పవిత్ర, సునీత మరియు షేక్షావలి సిఓఓ, రమణ జిఎం, నదీమ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.