
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి
ఢిల్లీ ( న్యూస్ వెలుగు ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేడు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను ఆయన కలిసి అనేక విషయాలను చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యల పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాములకు నివేదికలను సమర్పించినట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మరిన్ని నిధులు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించారు.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!