
గుక్కెడు నీరు కోసం ఏళ్లుగా కష్టాలు…! కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?
నంద్యాల ( న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాలు వీధిలోని తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఎన్ ఎస్ యు ఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శులు సి నాగరాజు , ఖాజా హుస్సేన్, సి. మధు ల ఆధ్వర్యంలో స్థానికుల నుంచి సంతకాల సేకరణ చేయడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా జలదుర్గం గ్రామంలోని కొత్త కొట్టాల వీధిలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న వారు ఇ విషయాన్ని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని , తాగునీటి సౌకర్యం లేక స్థానికులు ఊరి బయట ఉన్నటువంటి బోర్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని అయితే వృద్ధులు వికలాంగులు అంత దూరం పోలేక త్రాగటానికి నీళ్లు కూడా లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అయితే వీటిపై స్పందించవలసిన సచివాలయం సిబ్బంది మరియు సంబంధిత అధికారులు నిద్రపోతూ ఉన్నారని వారు ఎద్దేవా చేశారు..
అయితే ఇప్పటికైనా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారికి తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టామని, ఈ నీటి సమస్య తీరకపోతే జల్దుర్గంలోని సచివాలయాలకు తాళాలు వేస్తామని, అధికారులు వారి నిజమత్తులు వీడి వెంటనే జల దుర్గంలోని కొత్తకోట వీధికి తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రస్తుతానికి తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో స్థానికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతావని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను, కాజా, మధు స్థానికులు పాల్గొన్నారు.
