
భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం
అమరావతి (న్యూస్ వెలుగు): ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!