
పాకిస్తాన్ కు మరో అవకాశం ఇవ్వం: ఆర్మీ చీఫ్ జనరల్
న్యూస్ వెలుగు రాజస్తాన్: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఉగ్రవాదం పేరుతో భారత్ వైపు కొత్త కుయుక్తులు వేయాలనే ఆలోచన చేస్తే , పాకిస్తాన్ కు మరో అవకాశం ఇవ్వమని ఘాటుగా హెచ్చరించారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సిందూర్ తో రుచి చూపించినట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ సమీపంలోని 22 ఎండి సరిహద్దు గ్రామంలోని ఆర్మీ పోస్ట్ వద్ద సైనికులను ఉద్దేశించి జనరల్ ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ యొక్క ప్రాథమిక విజయం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించిన 9 ప్రదేశాలను నాశనం చేయడం అని ఆర్మీ చీఫ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టారని, దీని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారని ఆర్మీ చీఫ్ చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!