
ఆటో డ్రైవర్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాలో అర్హులైగ్న 13,495 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ లకు “ఆటో డ్రైవర్ సేవలో” పథకం కింద ఆర్థిక సాయంగా రూ.20.24 కోట్లు జమ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రై



విజయవాడ నుండి “ఆటో డ్రైవర్ సేవలో” పథకం ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,90,669 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయంగా రూ.436 కోట్ల రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తిలకించారు…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు ఆటో ఫిట్నెస్ కోసం, ఆటో రిపేర్ ల కోసం, ఇన్సూరెన్స్ కోసం ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు..ఆటో డ్రైవర్ సేవలో ” పథకం ద్వారా కర్నూలు జిల్లాలో 13,495 మంది డ్రైవర్ లకు 20 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోందని తెలిపారు.. సొంత ఆటో ఉండడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రేషన్ కార్డు తదితర అర్హతలు ఉంటే ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఆటో రిపేర్ లు చేయించుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటించి ప్రయాణికులను భద్రంగా తీసుకొని వెళ్లి డ్రాప్ చేయాలని కలెక్టర్ ఆటో డ్రైవర్ లకు సూచించారు..
కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందన్నారు.. ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పటికి సూపర్ సిక్స్ పథకాలు వందశాతం అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం కొరకు ఒకటే రోజు 8 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం లో దాదాపు 14 వందల కోట్ల రూపాయలతో రోడ్లు రిపేర్ లు చేయించాం అన్నారు. దేశం లో 13 ఇండస్ట్రీయల్ హబ్ లు ఏర్పాటు లో భాగంగా మనకు ఓర్వకల్ హబ్ ఇవ్వడం జరిగిందన్నారు.. ఓర్వకల్లు హబ్ కొరకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని దీని వలన జిల్లా లో మరియు రాష్ట్రం గణనీయంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.. జైరాజ్ ఇస్పాత్ , డ్రోన్ హబ్ ,కోకోకోలా , రిలయన్స్ మొదలగు కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ఆగస్టు నెల నుండి ” స్త్రీ శక్తి పధకం ” లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆటో డ్రైవర్ ల కు నష్టం కలుగుతుందని, వారి కొరకు ” ఆటోడ్రైవర్ల సేవలో ” పథకం అమలు చేసి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ తెలిపారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక పోయినా ఈ పథకానికి 436 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రం లో దాదాపు 3 లక్షల మందికి లబ్ది చేకూర్చడం జరుగుతోందని, కర్నూలు జిల్లా లో 13,495 ఆటో డ్రైవర్ ల కు దాదాపు 20 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అన్నారు.. కేవలం ఎన్నికలో హామీ ఇచ్చినవి మాత్రమే కాకుండా హామీ ఇవ్వని వాటిని కూడా చేస్తున్నారన్నారు.. అందులో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికలలో హామీ ఇవ్వనప్పటికీ కూడా ఆటో డ్రైవర్లకి సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వారికి “ఆటో డ్రైవర్ సేవలో ” పథకం కింద 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు… అర్హత ఉండి ఆటో డ్రైవర్ లకు ఎవరికైన పథకం లబ్ధి చేకూరని ఎడల వారు ఫిర్యాదు చేసే విధంగా గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో ” పథకం ద్వారా రాష్ట్రంలోని 2,90,669 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేకు గాను రూ. 436 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారన్నారు.. కర్నూలు జిల్లాలో 13,495 మంది డ్రైవర్ లకు 20 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తున్నారని తెలిపారు… గత ప్రభుత్వం కేవలం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేస్తే కూటమి ప్రభుత్వం 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు… స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు..
నాయిబ్రాహ్మణులకు ఉచితంగా సెలూన్ ఉంటే 200 యూనిట్ ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు… అదే విధంగా పిల్లలు చదువులకు తల్లులకు ఆర్థిక భారం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే వారందరి ఖాతాలో కూడా డబ్బు జమ చేసే తల్లికి వందనం కార్యక్రమంను తీసుకొని రావడం జరిగిందన్నారు.. నిరుద్యోగులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న డి ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలను కూడా అందచేయడం జరిగిందన్నారు.. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరిగిందన్నారు… దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ లను ఇస్తున్నామన్నారు… అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది 20 వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు… అన్న క్యాంటీన్ ల ద్వారా పేదలకు రుచికరమైన నాణ్యమైన భోజనం ఇవ్వడం జరుగుతుందన్నారు..
అనంతరం కర్నూలు జిల్లాలో అర్హులైన 13,495 మంది డ్రైవర్ లకు 20.24 కోట్ల రూపాయల మెగా చెక్కును అందచేశారు..
సమావేశంలో డి సి ఎం ఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ , బొందిల్ల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ , రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి , విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతి , డి. టి. సి. శాంత కుమారి, జెడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి , మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ,వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు , అధికారులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు..