
ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం: ఆప్టా
కర్నూలు (న్యూస్ వెలుగు ): గాజులదిన్నె గ్రామం గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో పని చేయచున్న శ్రీ జి సి బసవరాజు అనే సెకండరీ గ్రేడ్ టీచర్ పై అదే గ్రామానికి చెందిన మీసాల రంగస్వామి అనే వ్యక్తి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం తో తీవ్ర గాయాలు ఏర్పడ్డాయి. విద్యార్థి పాఠశాల కు సంక్రమంగా హాజరు కావాలని విద్యార్ధిని మందలించడం తో అతడి తండ్రి ఉపాధ్యాయుడి పై భౌతిక దాడి చేయడాన్ని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు , కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా లాల్ నాయక్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన అతనికి పై తీవ్ర చర్యలు తీసుకోవాలని, మునుముందు ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆప్టా రాష్ట్ర నాయకులు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మరియ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గారిని కోరటం జరిగింది. కర్నూలు జిల్లా విద్యాధికారి గారికి, కర్నూలు జిల్లా సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారు ఈవిషయం లో జోక్యం చేసుకోవాలి అని, దాడి చేసిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్టా జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
