FlatNews Buy Now
రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్

కర్నూలు (న్యూస్ వెలుగు) : ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో కర్నూలు జిల్లా ప్రజలకు ప్రజాధనం వృధా తప్ప ఒరిగేది ఏమీ లేదని కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిలాని భాష మాట్లాడుతూ గురువారం భారత ప్రధాన మంత్రి గారు వస్తున్నారని కర్నూలు జిల్లా వెనక పడిన ప్రాంతం ఫ్యాక్షన్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రాంతం ఒకప్పుడు ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధికి దూరమై ఇంకా అట్టడుగున దిగజారిన ప్రాంతం కర్నూలు జిల్లా. ఈ ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను హేచించడం ఎంతవరకు సమంజసమని ఇదే 400 కోట్లు కర్నూలు జిల్లా ప్రాంతానికి వెచ్చిస్తే కర్నూలు జిల్లా ఎంతో అభివృద్ధికి నోచుకుంటుంది కదా నరేంద్ర మోదీ  అని ప్రశ్నించారు.

నరేంద్ర మోదీ  జి యస్ టి ని పెంచమనింది ఎవరు జి యస్ టి ని తగ్గించి సంబరాంలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటనలో మాట్లాడుతు జి యస్ టి తగ్గించడం వల్ల 9 వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతుంది అంటే గత 8 సంవత్సరాల నుంచి జి యస్ టి పెంచినరోజు నుంచి ప్రతి నెల 9 వందల కోట్ల రూపాయలు ప్రజల రక్తం పిండినట్లేనా ఇన్ని రోజులు ప్రజల రక్త మాంసాలు పీల్చి అంబానీ, అదాని అంట కటి వారి అభివృద్ధికి మీరు పాటుపడి, రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా ఇస్తాననీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీరు మాటిచ్చారే ఆ మాట మర్చి పోయారా అని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అంటే 11సంవత్సరాల నుండి 22కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని మర్చిపోయారా అమలు కానీ హామీలు ఇచ్చి అందలమెక్కి ప్రజలను మోసం చేస్తూ ఏ మొహం పెట్టుకొని కర్నూలు జిల్లాకి వస్తున్నారని ఈ సందర్బంగా అడుగుతున్నామనీ దయచేసి ప్రధాన మంత్రి  ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అంటున్నారు కర్నూలుకి వస్తే సంబరాలు చేస్తాం అంటున్నారు. సన్మానాలు చేస్తాం అంటున్నారు ప్రధాన మంత్రి గారికి ఏమి అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రానికి ఈ కర్నూలుకి ప్రత్యేక హోదా ఇవ్వకపొగ రాష్ట్రాన్ని ఈ జిల్లాని అట్టడుగు స్థాయికి నెట్టింది కాక సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న యోగ డే అని చెప్పి 3 వందల కోట్ల రూపాయలు వైజాగ్ లో ప్రజాధనాన్ని మంచినీళ్లు లాగా ఖర్చు పెట్టారని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 500 కోట్ల రూపాయలు ఖర్చులు అవసరమా మరి ప్రజల పరిస్థితి ఏంటి ఇది ప్రజల ప్రజల సొమ్ము కాదా మీ సొంత జేబులోంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు అడిగే హక్కు లేదా అడిగితే అరెస్టులు జైలుపాలు చేస్తారా కేసులు పెడతారా ఇదెక్కడి న్యాయం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మొన్నటి దాక మీరే కదా మోదీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని మోదీ గారికి వ్యతిరేక సభ నల్ల చొక్కాలు ధరించి నిరసనలు చేశారే మరి ఈరోజు ఏమైందని మోదీ గారి భుజాన మోస్తున్నారనీ దయచేసి ఆలోచించండి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు వేదవతి, గుండ్రవుల ప్రాజెక్టులు పూర్తతే ఈ జిల్లా సస్య శ్యామలం కాదా రైతులకు మేలు జరగదా ఇవి ఆలోచించరా పర్యటనకు 8 వేల పోలీసులు, రాష్ట్ర యంత్రంగం, దేశ యంత్రంగము, నీళ్లు లాగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది కర్నూలులో మొత్తం మినిస్టర్లు, ఐ ఏ యస్ లు, ఐ పి యస్ లను ఇంత మందిని ఇబ్బంది పెట్టడం అవసరమా ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా దీని వల్ల ఒరిగేదేమీ లేదని దయచేసి ఆలోచించమని మోదీ గారిని ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ తరుపున అడుగుతున్నామనీ జిలాని భాష ప్రశ్నించారు. అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు హమీలు ఇచ్చిన మోడి మాట తప్పారని, నిరుద్యోగులు ఉపాధి లేక పిచ్చివారై రోడ్ల పై తిరుగుతూ, కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రత్యేక హోదపై గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మాయమాటలు చేప్పి మోడి ఇచ్చిన కమీషన్ కు అమ్ముడు పోయి ప్రజా హక్కులను తాకట్టు పేట్టారు.
కర్నూలు జిల్లాలో ఎ ఓక్క ప్రాజెక్ట్‌ పూర్తీ కాకపోవటం వలనే నేడు ఈ ప్రాంతం వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. విద్యాసంస్థలు అభివృద్ది చేయ్యాలని వాల్మీకులకు ఎస్టీ హోద అంశాన్ని నేర్వెర్తించాలని అన్నారు. కావున ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయ్యని మోడి గో బ్యాక్ అని నినాదిస్తూన్నామం మని మహేంద్ర నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు ఆర్ ప్రతాప్, యూత్ కాంగ్రెస్ నాయకురాలు రాజేశ్వరి, బస్తిపాడు దస్తగిరి మొదలగు వారు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS