
ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు : NSUI
డోన్ (న్యూస్ వెలుగు) : రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి ఓట్ చోర్ గద్దిచోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా డోన్ లో ఎన్ ఎస్ యు ఐ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాలేజీలలో , పాత బస్టాండ్ మరియు గుత్తి రోడ్డులో విద్యార్థులతో ప్రజలతో సంతకాల సేకరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్బు యాదవ్, యాగంటి విద్యార్థి నాయకులు మధు, మాబు, దాదా ఖలేందర్, నవీన్, దస్తగిరి లు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు పొడిచారని మరి ఇంకా ఎన్నో హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నిచారు .., వారి ప్రభుత్వంలోని జీఎస్టీ విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మరి ఇన్ని సంవత్సరాలు జీఎస్టీ వల్ల ఎంతోమంది నిరుపేదలకు తీరని అన్యాయం జరిగిందని వాటన్నిటిని ఎవరు భర్తీ చేస్తారని వారు ప్రశ్నించారు.
ఎన్నో ప్రభుత్వ రంగాలను కూడా ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ రంగాలకు మోడీ తొత్తుగా వ్యవహరిస్తూ వారికి అప్పనంగా అప్పజెప్పారని, యువకులకు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని, నల్లధనాన్ని వెలికి తీస్తానంటూ దొంగ మాటలు చెప్పారని వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రజలకు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.దేశాన్ని కార్పొరేట్ రంగానికి అప్పజెప్పి దేశ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న మోడీని కర్నూల్లో జరిగే బహిరంగ సభలో తప్పకుండా ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
