FlatNews Buy Now
శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ

కర్నూలు  (న్యూస్  వెలుగు ):  శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అన్నారు. అక్టోబర్ 15 ప్రపంచ అనాటమీ దినోత్సవం సందర్భంగా మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి వైద్యుడు మొట్టమొదటగా శరీర నిర్మాణ శాస్త్రాన్ని తెలుసుకుంటేనే వైద్యరంగంలో ముందుకు వెళ్లగలడని అన్నారు. ప్రపంచ ఆధునిక మానవ శాస్త్ర నిర్మాణ స్థాపకుడు ఆండ్రియాస్ వేసాలియస్ మరణించిన వారోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ అనారమీస్ట్స్ (IFAA) “గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అనాటమిని” 2025 సం. థీమ్ ప్రకటించిందని ఆమె తెలిపారు. విద్యార్థులు ప్రత్యేకంగా శరీర అంతర్గత నిర్మాణాలను బాడీ పెయింటింగ్స్ లో చూపిన విధానం చక్కగా వుందని, రంగులతో వేసిన విధానం బాగుందని కొనియాడారు. బాడీ పెయింటింగ్, శరీర అంతర్గత బాగాల ఆర్ట్ పోటీలకు న్యాయనిర్నేతలుగా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సాయి సుధీర్ కమ్యూనిటీ విభాగపు అధిపతి డాక్టర్ సుధాకుమారి వ్యవహరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్, పి.జి డా. రషీద్ తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS