
ఓట్ల చోరీతోనే… అధికారంలోకి వచ్చిన బిజెపి : కాంగ్రెస్
నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు అడ్మిన్ న్యాయవాది ఉన్ని గొర్ల జనార్దన్ ల ఆధ్వర్యంలో ” ఓట్ చోర్ గద్ది చోడ్ “(ఓట్లు దొంగ గద్దె దిగు) అనే నినాదముతో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా డోన్ లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి డోన్ సిపిఎం నాయకులు నక్కి శ్రీకాంత్ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియచేసారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఓట్ చోరీ కి పాల్పడి ప్రజాస్వామ్యం విలువను అవమానిస్తూ మూడోసారి గద్దెక్కారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని,ప్రజలు జవాబుదారీగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రజలు పలు డిమాండ్లను కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెడుతున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగాలంటే కావాల్సింది GST ఉత్సవాలు కాదు.. “ప్రత్యేక హోదా”హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అని,2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలైవుంటే నేడు దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదని,జి ఎస్ టి అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని జి ఎస్ టి పేరుతో 2017-18 నుంచి 2024-25 మధ్య 8 ఏళ్లలో రూ.55,44,897 కోట్లుదోపిడీ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 2.O సంస్కరణల పేరుతో రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే తగ్గించారని,ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన మోడీ గారు,గోరంత ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారని ఈ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధమని,వారు విమర్శించారు. ఈ కార్యక్రమం లో సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్,నంద్యాల డిసిసి ప్రధానకార్యదర్శి (ఆర్గనైజేషన్)వడ్డే రాజశేఖర్, డిసిసి కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావ్, ప్యాపీలి మండల అధ్యక్షులు ఎస్. మహేంద్ర నాయుడు,డోన్ మండల అధ్యక్షులు పఠాన్ మహబూబ్ హుస్సేన్,డోన్ పట్టణ ఉపాధ్యక్షులు హనుమాన్,బేతంచెర్ల కాంగ్రెస్ నాయకులు షాషావలి, మొహిద్దీన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి. నాగన్న, గిడ్డయ్య, అప్పన్న, బాలదస్తగిరి, వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
