వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకోం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 

పాణ్యం (న్యూస్ వెలుగు): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “రచ్చబండ – కోటి సంతకాల సేకరణ” కార్యక్రమం కల్లూరు అర్బన్, 31వ వార్డు నందు బుధవారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇంటింటి దగ్గరకు వెళ్లి ప్రజలందరితో కలిసి సంతకాల సేకరణలో పాల్గొని, వైయస్ఆర్ సీపీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందించాలని భావించి రూ.8 వేల కోట్లతో 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని,. వైయస్‌ జగన్‌ హయాంలో కోవిడ్‌ తర్వాత ఏడు కళాశాలలు పూర్తి చేసినన ఘనత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఐదు మెడికల్‌ కళాశాలలను అందుబాటులోకి తెచ్చామని, నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్‌తో రెండు కళాశాలలు అందుబాటులోకి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిచ్చారు..లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర పూరీతమన్నారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ప్రజలు దీనిని గుర్తించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందన్నారు. మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వాహణ చేస్తామంటే వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం పరోక్షంగా వదిలించుకుని, ప్రైవేట్‌ వాళ్లకు వైద్య విద్యను అప్పగించడమేనని బల్లగుద్ది ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందజేస్తామన్నారు..సీఎం చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకుందని, ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత, రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాను..అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్పొరేటర్లు, వార్డులోని సభ్యులు,అనుబంధం విభాగాల వివిధ హోదాల్లో ఉన్నవారు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!