
ఎల్ఆర్యస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: కమిషనర్ పి.విశ్వనాథ్
Sek కర్నూలు (న్యూస్ వెలుగు): నగర పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్యస్) పథకానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు “ఓపెన్ ఫోరం” కార్యక్రమంలో ప్రజల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించి, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్యస్ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసినందున, వచ్చిన 1,800 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, డిసిసి వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

