
కర్నూలులో హాకీ టర్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలి
జాయింట్ కలెక్టర్ న్యూరుల్ క్యామర్ కు వినతపత్రం సమర్పించిన ఆర్వీపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్.
కర్నూలు , న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలో హాకీ టర్ఫ్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ నేడు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ క్యామర్ ను రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రైజింగ్ స్టార్ హాకీ క్లబ్ అండ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ మదాసి కురువ,జిల్లా సెక్రెటరీ సెక్రెటరీ కె రాము కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు వందమంది విద్యార్థిని విద్యార్థులు హాకీ క్రీడను నేర్చుకుంటున్నారని రైసింగ్ స్టార్ హాకీ క్లబ్ &సొసైటీ ద్వారా ఎన్నో టోర్నమెంట్లను మరియు దాతల ద్వారా వివిధ రకాల క్రీడా పరికరాలను టీ షర్టులను తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులకు హాకీ సొసైటీ ద్వారా ఇప్పించడం జరుగిందని అంతరించిపోతున్న హాకీ క్రీడను కర్నూలు జిల్లా నందు క్రీడాకారులను తర్ఫీదు ఇచ్చి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయి వరకు వారికి శిక్షణ ఇచ్చి మంచి ప్రతిభ కనబరిచి పథకాలు సాధించేలా కృషిచేసి హాకీ క్రీడాకారుల జీవితంలో వెలుగులు నింపడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని కర్నూలు జిల్లాలో హాకీ క్రీడకు సంబంధించి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని,కావున తక్షణమే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దగ్గర ఉన్న అనురాగ్ ఎస్టేట్లో పార్కు కోసం కేటాయించిన ఒక ఎకర ఇరవైరెండు సెంట్లు స్థలం ఉన్నదని పార్కు స్థలంలో ముళ్ల పొదలను,కంపచెట్లను తొలగించి ఎత్తుతగ్గులను సమతుల్యం చేసి క్రీడా ప్రాంగణంగా తయారు చేసి ఉన్నామని కావున సంబంధిత స్థలంలో హాకీ టర్ఫ్ కోర్టును ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ న్యూరుల్ క్యామర్ కు వారు వినతి పత్రం అందచేసీ కోరామన్నారు,జాయింట్ కలెక్టర్ నూరుల్ క్యామర్ సానుకూలముగా స్పందించి అవకాశం ఉంటే తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు మదాసి కురువ ప్రకాష్,రమేష్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

