బోర్డు సభ్యులతో ఛైర్మన్ ట్రయల్ మీటింగ్

బోర్డు సభ్యులతో ఛైర్మన్ ట్రయల్ మీటింగ్

ఇంద్రకీలాద్రి (న్యూస్ వెలుగు):కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ )ఛాంబర్లలో నూతనంగా నియమితులైన బోర్డు సభ్యులతో ట్రయల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నవంబర్ 7వ తేదీన జరగబోయే తొలి బోర్డు సమావేశానికి సన్నాహక భేటీగా జరిగింది. తొలి సమావేశంలో చర్చించవలసిన ఎజెండాలపై ఛైర్మన్ మరియు సభ్యులు కూలంకషంగా చర్చించారు.
సమావేశం అనంతరం, ఛైర్మన్ మరియు అందుబాటులో ఉన్న సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు విభాగాలను తనిఖీ చేశారు. బుద్ధవారి గుడి వద్ద లడ్డూ తయారీ పోటును, శృంగేరి మండపం వద్ద అన్నప్రసాదం హాలును, అలాగే కొత్తగా నిర్మిస్తున్న అన్నదానం భవనం మరియు కొత్త లడ్డూ పోటు భవనాలను సందర్శించి, భవిష్యత్తు కార్యాచరణ మెరుగుదల కోసం పరిశీలనలు చేశారు.
ఆ తర్వాత, కనకదుర్గనగర్ సమీపంలోని కొండ దిగువన ఉన్న దుకాణాలు మరియు విక్రయదారులను తనిఖీ చేశారు. ఆలయానికి నడిచి వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఫుట్‌పాత్‌ను ఆక్రమించవద్దని దుకాణదారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా కొత్తగా బారికేడింగ్ మరియు మార్కింగ్ ఏర్పాటు చేస్తామని, అందుకు దుకాణదారులు సహకరించాలని కోరగా, వారు అంగీకారం తెలిపారు.
ఈ సమావేశం మరియు తనిఖీ కార్యక్రమంలో ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణతో[ గాంధీ) పాటు సభ్యులుగా అవ్వారు శ్రీనివాస రావు, బడేటి ధర్మారావు, గూడపాటి వెంకట సరోజిని దేవి, హరి కృష్ణ, మన్నే కలవతి, పద్మావతి ఠాకూర్, పెనుమత్స రాఘవ రాజు, సుకాసి సరిత, తాంబళ్లపల్లి రామ దేవి, ఎల్.డి.పి.దుర్గా ప్రసాద్, ప్రధాన అర్చకులు (ఎక్స్-అఫిషియో సభ్యులు), మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా మార్తి రామ బ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!