
పెరవలి రంగనాథ స్వామి హుండీ లెక్కింపు
Immమద్దికేర (న్యూస్ వెలుగు) : మద్దికేర మండల పరిధిలోని గల పెరవలి గ్రామం నందు వెలసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయ హుండీ ను ఆదోని డివిజన్ తనిఖీ అధికారి వెంకటేష్, కార్యనిర్వహణాధికారి వీరయ్య,పాలక మండలి చైర్మన్ ఆర్ఆర్ రవికుమార్ ల ఆధ్వర్యంలో మంగళవారం రోజున లెక్కించారు.ఈ సందర్భంగా పెరవలి రంగనాథ స్వామి దేవాలయ కార్యనిర్వాహణాధికారి వీరయ్య మాట్లాడుతూ ఏడు నెలల అనంతరం హుండీను తెరచి లెక్కించగా 11,13,349 రూపాయల నగదు వచ్చిందని, అదేవిధంగా స్వామికి సమర్పించిన బియ్యం వేలం వేయగా 2247 కేజీలకు గాను 49,996 రూపాయలు వచ్చాయని ఆయన తెలియజేశారు.గత ఏడు నెలల క్రితం లెక్కించిన హుండీకు నేడు లెక్కించిన హుండీకు 51,189 రూపాయల ఆదాయం పెరిగిందని కార్యనిర్వహణ అధికారి వీరయ్య తెలియజేశారు. భక్తుల ద్వారా స్వామి వారికి పెరిగిన ఆదాయాన్ని రంగనాథ స్వామి దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు రంగస్వామి, పాలకమండి సభ్యులు నెట్టికంటయ్య, వెంకటగిరి స్వామి,లక్ష్మీదేవి,మహాలక్ష్మి, ఈశ్వరమ్మ,శ్రీనివాసులు,మద్దికేర నాగప్ప,బోయిని గోపాల్,గ్రామ పెద్దలు, ప్రజలు,ఆలయ సిబ్బంది,సేవకులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

