దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

ఇంద్రకీలాద్రి, (న్యూస్ వెలుగు): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని సినీ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి శిరీష దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కుటుంబ సంబంధీకుడైన నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

                                                                                                                                 దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె. శీనా నాయక్ స్వయంగా నూతన దంపతులను సాదరంగా ఆహ్వానించి, అమ్మవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం, చైర్మన్ మరియు ఈఓ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.దుర్గమ్మ సన్నిధిలో సినీ హీరో నారా రోహిత్ దంపతులు

Authors

Was this helpful?

Thanks for your feedback!