
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి :జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్
కర్నూలు(న్యూస్ వెలుగు): విద్యార్థులు క్రీడల్లో సాధన చేయడం ద్వారా మానసిక ఉల్లాసం దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు నిర్వహించిన కర్నూలు డివిజన్ స్థాయి బాలికల పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ పోటీలలో విజేతగా నిలిచిన భారత జట్టు అని బాలికలు స్ఫూర్తిగా తీసుకొని తాము ఎంచుకున్న క్రీడారంగంలో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకున్నప్పుడే నిజమైన క్రీడాకారుడు వెలుగులోకి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గర్ల్స్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణ, డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు,జిల్లా స్కూల్ గేమ్స్ జాయింట్ సెక్రటరీలు పరమేష్,శేఖర్,వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అనంతరం డిఈఓ కబడ్డీ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

