
శ్రీ కనకదాస్ జయంతి విజయవంతం చేయాలి
హొలగుంద (న్యూస్ వెలుగు): మండలకేంద్రంలో శ్రీ శ్రీ భక్త కనకదాస్ 538వ జయంతి సందర్బంగా ఆలూరు నియోజక వర్గ అన్ని గ్రామాల్లో జరుగబోయి శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతిని మాదాసి మాదారి కురువ కులస్తులందరూ ఐక్యంగా కలిసిమెలిసి బుధవారం ఘనంగా కనకదా జయంతిని జరుపుకోవాలని
గౌరవాధ్యక్షుడు కాలికి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 538 వ జయంతి జరుపుకోవడానికి ప్రత్యేక జీవో విడుదల చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి నిర్వహించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలనీ కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గిరి,మాధసి కురువ సంగం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యట మల్లయ్య, గాదిలింగప్ప,వీరభద్రప్ప,మల్లికార్జున,ముద్దటమాగి, ఆనంద్,వీరేష్, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

