
ఉన్నత విద్యాశాఖ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్
Rఅమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఉండవల్లి తన నివాసంలో బుధవారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్ లోగా పరిశ్రమలతో అనుసంధానానికి చర్యలు చేపట్టాలన్నారు. యూనివర్సిటీలు, ఐటీఐ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల వందశాతం ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ విద్యపైనా సమీక్షించాను. ఇంటర్ లో ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

