
అమరావతి(న్యూస్ వెలుగు) : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 406 జాబ్ మేళాల ద్వారా 78వేలమంది యువతకు ఉద్యోగాలు లభించాయన్నారు. జాబ్ మేళాల్లో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలని అధికారులను కోరాను. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా డిజిటల్, ఎఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించినట్లు వెల్లడించారు. అధునాతన సాంకేతికతలపై ప్రపంచస్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఐటిఐ, పాలిటెక్నిక్ ల కరిక్యులమ్ లో మార్పులపై దృష్టిసారించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

