
రాష్ట్రస్థాయి పోటీలకు గార్గేయాపురం విద్యార్థులు
కర్నూలు( న్యూస్ వెలుగు):విద్యార్థలో దాగివున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి వారిని క్రీడా పోటీలు దోహద పడతాయని ప్రధానోపాధ్యాయులు వెంకట రాముడు అన్నారు.గురువారం కర్నూలు సమీపంలో ఉన్న గార్గేయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటరాముడు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 బాల బాలికల బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు ఎంపిక అయినట్లు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన భువనేశ్వరి అండర్ 17 బాస్కెట్ బాల్ బాలిక విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైనది అదేవిధంగా అండర్ 14 బాలబాలికలు విభాగంలో తమ పాఠశాలకు చెందిన ఎం నాసిర్ బేగ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బాలుర విభాగంలో ఎంపికయ్యారు. అదేవిధంగా బాలికల విభాగంలో తమ పాఠశాలకు చెందిన జయలక్ష్మి ఎంపిక అయినదని తెలిపారు. ఎంపికైన అండర్ 14 క్రీడాకారులు అన్నమయ్య జిల్లాలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోవు 69వ రాష్ట్రస్థాయి పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. అదేవిధంగా ఏలూరు జిల్లా నూజివీడు లో ఈనెల 21 నుంచి 23వరకు జరగబోవు 69వ రాష్ట్రస్థాయి బాస్కెట బాల్ పోటీలలో భువనేశ్వరి అండర్ 17 కర్నూలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు అదేవిధంగా రాష్ట్ర జట్టుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. వీరిని క్రీడా దుస్తులు బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు పాల్ విజయకుమార్ మరియు రాజశేఖర్ లు పాల్గొన్నారు.

