
హర్షం వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు(న్యూస్ వెలుగు): భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండడం పై ఎంపీ బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్ది తో కలిసి నిర్వహించిన మీడియాలో సమావేశంలో భక్త కనక దాసు జయంతి పై ఆయన మాట్లాడారు..భక్త కనకదాసు తన కీర్తనలు , రచనలు ద్వారా సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు కృషి చేయడతో పాటు, సాక్ష్యాత్తు దైవాన్నే తన వైపు తిప్పుకున్నారన్నారు. అలాంటి మహానీయుని జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండువగా నిర్వహించడం ఆనందకరమన్నారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో నిర్వహించే రాష్ట్రస్థాయి జయంత్యోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనకదాసు జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఎంపీ పిలుపునిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!

