రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా రాణించాలి

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా రాణించాలి

కర్నూలు (న్యూస్ వెలుగు): పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో లయోలా కళాశాల క్రీడా మైదానంలో నవంబర్ 8 తేదీ నుంచి 9 తేదీ వరకు జరగబోయే రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాప్ట్ బాల్ పోటీలలో పాల్గొనే కర్నూలు జిల్లా జట్టుకు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అలీమ్ భాష క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీల్లో పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలియజేస్తూ ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు. క్రీడలు మన జీవితంలో ఒక భాగం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కుబేర నాయుడు , సంయుక్త కార్యదర్శి అయ్యన్న గౌడు , కార్యవర్గ సభ్యుడు శాంతరాజ్ హాజరైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!