వందేమాతర గీతానికి 150 ఏళ్లు

వందేమాతర గీతానికి 150 ఏళ్లు

కర్నూలు (న్యూస్ వెలుగు): పత్తికొండ( న్యూస్ వెలుగు): పత్తికొండలో ఘనంగా సంపూర్ణ వందేమాతరం గేయ ఆలాపన విద్యార్థి దశ నుంచే దేశ భావాలను పునికి పుచ్చుకుందని పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ ప్రత్యేక అతిధిగా పాలోని మాట్లాడారు.

శుక్రవారం పత్తికొండలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి సంపూర్ణ వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఇందులో భాగంగా సెయింట్ జోసెఫ్ స్కూల్లో వందేమాతరం ప్రోగ్రాం ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు అధ్యక్షతన రూరల్ సీఐ పులిశేఖర్ వందేమాతర గీతాలాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ…వందేమాతరం గీతం మన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చిన గీతమన్నారు. ఇది కేవలం పాట కాదు, దేశభక్తి యొక్క చిహ్నమని, ప్రతి భారతీయుడు ఈ గీతాన్ని గుండె లోతుల్లో గౌరవించాలి,” ఈ గీతం నేటితో నూట యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటర్జీ ని స్మరిస్తూ విద్యార్థిని, విద్యార్థులు మీ విద్యార్థి దశ నుండే దేశంపై సమగ్రంగా, సృజనాత్మకంగా దేశ నిర్మాణంలో మీరు బాగస్వాములు అయ్యేవిధంగా ఆలోచనలు ఉండాలని సిఐ పులిశేఖర్ అన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాల్గొన్న ప్రోగ్రాం ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు, సహా ఇంచార్జ్ కరణం నరేష్ మాట్లాడుతూ..వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వరాజ్యం – స్వదేశీ – సమైక్యత అనే నినాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందని దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని, యువతలో దేశభక్తి పెంపొందించడమే మన జాతీయ గీతం ‘వందేమాతరం’ను పూర్తిగా నేర్చుకుని ఇతరులకు నేర్పించేలా ప్రతి విద్యార్థి ముందుకు రావాని తెలిపారు. వందేమాతర గీతాలాపన కార్యక్రమంలో ప్రోగ్రాం సభ్యులు హోసూరు బ్రహ్మయ్య, దండి మల్లికార్జున, అడ్వకేట్ భాస్కర్, శంకరయ్య ఆచారి,గోరంట్ల, రామాంజనేయులు, సోమశేఖర్ రెడ్డి, కరణం చంద్రన్న, దేవకుంట రామంజి పాఠశాల మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS