ఘనంగా వందేమాతర గేయ వేడుకలు

ఘనంగా వందేమాతర గేయ వేడుకలు

తుగ్గలి (న్యూస్ వెలుగు): 1875 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన బంకించంద్ర చటర్జీ ద్వారా రచింపబడిన వందేమాతర గేయానికి నేటితో 150 వసంతాలు పూర్తి అయ్యాయని తుగ్గలి ఎస్సై బాల నరసింహులు,జొన్నగిరి ఎస్సై ఎన్.సి మల్లికార్జున లు తెలియజేశారు. శుక్రవారం మండల పరిధిలోని గల తుగ్గలి మరియు జొన్నగిరి పోలీస్ స్టేషన్ ల యందు జిల్లా ఉన్నత పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు తుగ్గలి ఎస్సై బాల నరసింహులు తుగ్గలి పోలీస్ సిబ్బందితో కలసి వందేమాతరం గేయాన్ని ఆలపించినట్లు తెలిపారు. వందేమాతరం గేయం యొక్క విశిష్టతను ఆయన వివరించారు.అదేవిధంగా జొన్నగిరి పోలీస్ స్టేషన్ యందు ఎస్సై మల్లికార్జున తమ పోలీస్ సిబ్బందితో కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించి, వందేమాతరం గేయం యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన వివరించారు. మండల పరిధిలోని గల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల యందు ఉపాధ్యాయులు వందేమాతర గేయాన్ని ఆలపించి 150వ వసంతాల వేడుకలను విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించిందని వారు తెలియజేశారు.తద్వారా ఈ వందేమాతర గీతాన్ని భారత ప్రభుత్వం జాతీయగీతంగా పరిగణించిందని వారు తెలియజేశారు. వందేమాతరం గేయం స్ఫూర్తితో పలు ఉద్యమాలలో ఎన్నో ఫలితాలను పోరాట యోధులు రాబట్టారని ఉపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీసులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!