
సీజనల్ హాస్టల్ ను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి
తుగ్గలి (న్యూస్ వెలుగు):మండల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన సీజనల్ హాస్టల్ ను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.శుక్రవారం రోజున తుగ్గలి మండలంలో పత్తికొండ శాసన సభ్యులు కే.యి శ్యాం కుమార్ ఆదేశాల మేరకు పలు గ్రామాలలో సీజనల్ హాస్టల్స్ ను ప్రారంభించారు.మండల పరిధిలో ఎర్రగుడి,జిన్నగిరి,పగిడిరాయి,చెన్నంపల్లి,శభాస్పురం,రాంపల్లి,పెండెకల్లు గ్రామాలలో టీడీపీ మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు,ఏపీఎం రాధాకృష్ణ, సీసీ లు, విద్యా కమిటీ చైర్మన్లు,ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొని సీజనల్ హాస్టల్ లను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రభుత్వం విద్యకు ప్రాదాన్యత కల్పించి వలస వెళ్లే కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను అందించే విధంగా కృషి చేస్తుందని,పత్తికొండ శాసనసభ్యులు శ్యాం కుమార్ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారని కావున నేడు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని వారు తెలియజేశారు.దీనిని వలస వెల్లె తల్లి తండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జొన్నగిరి సర్పంచ్ ఓబులేసు, రామాంజినేయులు,నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు వెంకటస్వామి, బాలన్న,విద్యా కమిటీ చైర్మన్ రవి కుమార్,పగిడిరాయి ఈశ్వర రెడ్డి,శభాష్ పురం మోహన్,శ్రీరాములు,పెండేకల్లు ఒలప్ప,చెన్నయ్య,కృష్ణ, ప్రధానోపాధ్యాయులు,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

