
విశాఖ కేజీహెచ్ లో కరెంటు కట్ ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్
ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు ): ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేస్తూ.. ప్రభుత్వ నిర్లక్ష్య పాలన వ్యవహారంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిజినరీ లీడర్ గా చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాలపై నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ కే జి హెచ్ లో 12 గంటల పాటు కరెంటు పోతే ప్రభుత్వానికి తెలియదా? అంటూ వైయస్ జగన్ ఆగ్రహించారు. విశాఖ కేజిహెచ్ లో వైద్యం పొందే రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా రాష్ట్రంలో నెలకొని ఉందని ఆసుపత్రికి వచ్చే పేద రోగులను పట్టించుకునే పరిస్థితి, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ మండిపడ్డారు. స్మార్ట్ గవర్నెన్స్, రియల్ టైం గవర్నెన్స్, డిజిటల్ టెక్నాలజీ, వంటి అనేక నూతన విధానాల పైన మాట్లాడే చంద్రబాబుకు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహణ పై శ్రద్ధ చూపే టైం కూడా లేని పరిస్థితి చంద్రబాబుకు ఉందని అందుకు తగ్గట్టుగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు.



