ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్

కర్నూలు ( న్యూస్ వెలుగు ) : కర్నూలు నుండి విశాఖపట్నంకు బస్సు సర్వీసులు ఉండటం వల్ల టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో 3 ఏ.సీ బస్సు నూతన సర్వీసులను కర్నూలు నుండి విశాఖపట్నంకు ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నుండి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఏ.సీ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. దీనివల్ల రెండు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. వైజాగ్ కు బస్సు సర్వీసులు కావాలని తెలిసిన వెంటనే అధికారులకు తగు సూచనలు ఇచ్చి ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిన అన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ప్రాణాపాయం జరగకుండా ఉంటుందన్నారు. ఈ విషయంపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు. త్వరలో ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీను కలిసి ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ పై చర్చిస్తానని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టిసి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!