పాఠశాల,అంగన్వాడీలను పరిశీలించిన ట్రైనింగ్ కలెక్టర్లు

పాఠశాల,అంగన్వాడీలను పరిశీలించిన ట్రైనింగ్ కలెక్టర్లు

హొళగుంద (న్యూస్ వెలుగు ): మండల ఆస్పిరేషన్ బ్లాక్ కు ఎంపిక కావడంతో మండల కేంద్రానికి వివిధ సమస్య పై పరిశీలన నిమిత్తం 6 మంది ట్రైనింగ్ కలెక్టర్లు పర్యటించారు. ఇందులో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల,డిపిఈపీ పాఠశాల,కేజీబీవీ పాఠశాల,ఎంపీపీకే రాజనగర్ కన్నడ పాఠశాల,అంగన్వాడి మూడవ సెంటర్ ను శివం సింగ్ శివాని మైకేల్ నిదియా కలెక్టర్లు పరిశీలించారు. అంతకు ముందు ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెత్త ఊడ్చి శ్రమదానం చేశారు.అదేవిధంగా చెత్త నుండి సంపద కేంద్రాని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి దేశానికి ఉత్తమ పౌరులుగా ఎదగాలని తెలియజేశారు.అలాగే అంగన్వాడిలో పౌష్టికాహారం పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సుధారాణి,కబీర్ సాబ్,సూపర్ వైజర్ షిభా రాణి,ఈఓఆర్డీ చక్రవర్తి,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,రంగ స్వామి,నాగరాజ్,ఆస్పిరేషన్ బ్లాక్ రవి శంకర్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS