రంగాపురం లో వ్యక్తి దారణ హత్య 

రంగాపురం లో వ్యక్తి దారణ హత్య 

బేతంచెర్ల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోమద్దిలేటి స్వామి ముఖ ద్వారం వద్ద సయ్యద్ మహబూబ్ బాషా ( 41 ) బుధవారం దారణ హత్యకు గురయ్యాడు.మృతుని కూతురు సయ్యద్ ఆసియా ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.స్థానిక గ్రామానికి చెందిన బోయ మదన భూపాల్ కు మా తల్లి సయ్యద్ మున్ని కి వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో మా తండ్రి సయ్యద్ మహబూబ్ బాషా నిత్యం గొడవపడేవాడని ఆమె తెలిపింది.ముద్దాయి మదన గోపాల్ మంగళవారం అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి,మా నాన్న పై గొడవపడి బల్లెంతో పొడిచి చంపాడని ఆమె తెలిపింది.నా తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.సంఘటన స్థలానికి సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై రమేష్ బాబు,చేరుకొని దర్యాప్తు చేశారు.సయ్యద్ ఆసియా ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు

Author

Was this helpful?

Thanks for your feedback!