యావత్ తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి

యావత్ తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి

కర్నూలు (న్యూస్ వెలుగు) : యావత్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో మొట్ట మొదటిసారిగా రాష్ట్ర గవర్నర్

హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ కాన్వకేషన్ లో బాలికల అధిక శాతం లో బంగారు పతకాలు తీసుకోవడం తనకు సంతోషం ఇచ్చిందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని విద్యార్థులు మార్పులకు అనుగుణంగా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద చెప్పిన తెలివైన మాటలను గుర్తుచేసుకుందాం అంటూ “ఒక ఆలోచనను చేపట్టండి. ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి – దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలలు కనండి,ఆ ఆలోచన పై జీవించండి ఇదే విజయానికి మార్గం అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.గేట్ వే ఆఫ్ రాయలసీమ గా కర్నూలు దినదిన అభివృద్ధి చెందుతుందని,దేశంలోనే ప్రముఖంగా ఉన్న ఐఐఐటిడిఎం తో పాటు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ,క్లస్టర్ యూనివర్సిటీలు ప్రధానంగా కర్నూలు లోనే ఉన్నాయని ఆ సంస్థలు అనేకమంది విద్యార్థులను భావి భారత పౌరులను తీర్చిదిద్ది దేశ అభివృద్ధికి పాటుపడుతున్నాయి అన్నారు.వికసిత్ భారత్ – 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరం అడుగులు వేసి చారిత్రాత్మక అభివృద్ధికి పాటు పడదామని అన్నారు.జాతీయ విద్యా విధానం అమలు పరచడంలో రాష్ట్రంలోనే రాయలసీమ యూనివర్సిటీ అగ్రరామంగా ఉందని అన్నారు.అంతకుముందు రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి వెంకట బసవరావు మాట్లాడుతూ

రాయలసీమ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుండి

విద్యార్థుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.యూనివర్సిటీ ప్రాంగణంలో రూసా నిధుల ద్వారా యూనివర్సిటీ ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నామన్నారు. యూనివర్సిటీ కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆకాంక్ష అంతర్జాతీయ యూనివర్సిటీ గేమ్స్ కు రాయలసీమ యూనివర్సిటీ నుంచి 2022-23 అకాడమిక్ ఇయర్ లో ప్రతినిత్యం వహించిందని గుర్తు చేశారు.యూనివర్సిటీ విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో రాణిస్తూ అనేక స్థాయిల్లో గెలుపొందారని అన్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాడ్మింటన్ పోటీలలో వరుసగా రెండో స్థానంలో నిలిచారన్నారు. క్రీడాకారులు ఆల్ ఇండియా తో పాటు ఖేల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో ప్రతినిత్యం వహించినట్టు తెలిపారు.అనంతరం గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత ఏ.ఎమ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి రామకుమార్ మాట్లాడుతూ రాయలసీమలో యూనివర్సిటీ లాంటి మహా విద్యాలయంలో విద్యార్థులు డిగ్రీ పట్టాను తీసుకొని దేశంలోనే అక్రమ అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు.నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యార్థులు తమ లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు. వివిధ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కే.మధు మూర్తి,కర్నూలు ఎంపీ నాగరాజు,డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి ప్రొఫెసర్ పి.ఎస్. షావలీ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి,కర్నూలు ఆర్డీవో సందీప్,రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్ ఎన్.టి.కే నాయక్,రిజిస్టర్ విజయ్ కుమార్, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్ లు,డీన్ లు,డైరెక్టర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. అంతకుముందు గవర్నర్ కు ఎన్సిసి విద్యార్థులు గౌరవ వందనం చేసి ఆహ్వానం పలికారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!