
గిరిజన గురుకుల పాఠశాలలో స్వచ్ఛత హీ దివస్ కార్యక్రమం
తుగ్గలి న్యూస్ వెలుగు: రాతన గిరిజన గురుకుల పాఠశాల యందు అధికారులు స్వచ్ఛత హీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.శనివారం ఉపసర్పంచ్ అన్వర్ భాష ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీహరి,పంచాయతీ కార్యదర్శి శివ,గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ లు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛత హీ దివస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రపరిచారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలను మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించవచ్చని వారు తెలియజేశారు.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు మైరాముడు, విద్యార్థులు,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

