
కురువ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు మృతి తీరని లోటు
కర్నూలు న్యూస్ వెలుగు: ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు నాగన్న మృతి సంఘానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు ప్రదానకార్యదర్శి ఎం. కె.రంగస్వామి గౌరవ సలహాదారులు టీ. పాలసుంకన్న,ఉపాధ్యక్షులు కె ధనుంజయ, కె. టీ. ఉరుకుందు,బి. వెంకటేశ్వర్లు,కె. సి. నాగన్న, నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ నాగన్న సంఘం నకు మరియు వివాహపరిచయ వేదిక కన్వీనర్ గా విశేష సేవలు చేసారని చెప్పారు.కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు నగర అధ్యక్షులు, కార్యదర్శి తవుడు శ్రీనివాసులు, బి. రామకృష్ణ,కె. రామచంద్రుడు, బి. సి. తిరుపాల్,వెంకటేశ్వర్లు, దివాకర్, పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

