పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగేదెప్పుడు : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగేదెప్పుడు : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

పత్తికొండ  న్యూస్ వెలుగు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద ప్రజలు ఉచిత ఆరోగ్య సేవలకు దూరమవడంతో పాటు, పేద విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగే అవకాశానికి దూరమవుతున్నారని  పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  విమర్శించారు.పిపిపి విధానం పేరుతోమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసిపి అధిష్టానం ఆదేశం మేరకు పత్తికొండ మండలం హోసూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోసూరు ప్రధాన కూడలిలోని పీర్ల చావడి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం, మూడు, నాలుగు వార్డులలో ఇంటింటికి వెళ్లి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వరం చేస్తే పేదలకు, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు జరిగిన నష్టాలపై వివరించి సంతకాల సేకరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంబిస్తే రాబోయే కాలంలో విద్యార్థిలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని   ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.   కార్యక్రమంలో హోసూర్ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు,సర్పంచు, ఎంపీటీసీలు, రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు,మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Author

Was this helpful?

Thanks for your feedback!