
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆన్ లైన్ లో పాల్గొన్నారు. వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. డిసెంబరు 3 తేదీన నిర్వహించనున్న రైతన్నా – మీ కోసం కార్యక్రమంలో తానూ పాల్గొంటానని సీఎం స్పష్టం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!

