
పశువులకు మేతగా అరటి గెలలు..!
అమరావతి న్యూస్ వెలుగు : రాష్ట్రంలో అరటి రైతులది అరణ్య రోదనలు గురిచేసిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల ఆన్నారు . సిరులు కురిపించే పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుందని . అన్నదాతను అరటి పంట ముంచుతుంటే, రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టక పోవడం సిగ్గుచేటని , టన్నుకు 28 వేల నుంచి వెయ్యికి పడిపోతే,రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? అని ఆమె ప్రభుత్వం పై మండిపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యానవన శాఖ పని చేస్తుందా.. మొద్దు నిద్ర పోతుందా ఆమె ఆగ్రహించారు. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను పశువులకు మేతగా పడేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎక్కడుంది రైతు సంక్షేమమని ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అరటి రైతుల బాధలను వినలని , ధరల పతనంపై సమీక్ష జరిపి రైతులకు న్యాయం జరగలన్నారు. గల్ఫ్, యూరప్ దేశాలకు రైతులు పండించిన పంటను ఎగుమతులు చేయాలన్నారు. రాష్ట్రంలో రైతుల పంటను ఎందుకు ఎగుమతులు తగ్గాయో పరిశీలించి తక్షణం ఎగుమతులు ప్రారంభించన్నారు. రైతుకు టన్నుకు కనీసం 25 వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు వైఎస్ షర్మిల తెలిపారు.


