
జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు ఏపీ క్రీడాకారులు
కర్నూలు న్యూస్ వెలుగు : నవంబర్ 24 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగబోయే 12వ జాతీయ స్థాయి సీనియర్ డ్రాగన్ బోట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శనివారం కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి పయనమయ్యారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి లు హాజరై మాట్లాడారు.జాతీయ స్థాయిలో సత్తా చాటి రాష్ట్ర జట్టు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఏపీ జట్టు మిక్స్డ్ విభాగంలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. జట్టు లో పాల్గొంటున్న వారి వివరాలను వారు వెల్లడించారు . టీ.ధోని,రాయ లిఖిత చౌదరి,కే మోహిత్ రావ్, డి. ఆసిఫా నాజ్ (అంతఃపురం), కమ్మరి శేఖర్, చెంచు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ (కర్నూలు), హరిజన రామచంద్రుడు (నంద్యాల),ఎన్ శివాజీ, పి మోహన లక్ష్మీ ప్రియాంక (ప్రకాశం) ఈ పోటీలలో గెలుపొందేందుకు పూర్తి స్తాయిలో శిక్షణ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.


