
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పుట్టపర్తి న్యూస్ వెలుగు : సత్య సాయి బాబా శతజయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తి విమానాశ్రయానికి శనివారం చేరుకున్నారు.పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి సీఎం చంద్రబాబు , మంత్రులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ , సత్య కుమార్ యాదవ్ , సవితమ్మ , కందుల దుర్గేష్ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, సహచర ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు,పరిటాల సునీత, బండారు శ్రావణి,ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, కందికుంట వెంకటప్రసాద్, దగ్గుపాటి వెంకట ప్రసాద్,బిజెపి నేత సోమ గుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ఇతర మంత్రులు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు సహచర ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. అనంతరం సత్యసాయి బాబా డ్రీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవ వేడుకల్లో వారు పాల్గొంటారు.

