
మాలల రణభేరి సభను విజయవంతం చేయాలి
అయిజ న్యూస్ వెలుగు : అంబేద్కర్ చౌక్ నందు మాలల రణభేరి మహాసభ కరపత్రం ఆవిష్కరణ చేశారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జనాభా లెక్కలు చేయకుండానే మాలలకు 5 శాతం, మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగాల్లో మాలలకు 28 పోస్టులుంటే మాదిగలకు 100 పోస్టులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రోస్టర్ పాయింట్ల కేటాయింపును పున: సమీక్షించాలన్నారు. జీఓ 99 ని సవరించి మాలలతో పాటు గ్రూప్ 3 లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. హైదరాబాద్లో నవంబర్ 23 న నిర్వహించే మాలల రణభేరి మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాల మల్లికార్జున్, మండల అధ్యక్షుడు మాల శివరాజ్ ఈరన్న, వీరేష్,సురేష్, బాలు, రామకృష్ణ, గణేష్,అశోక్,తదితరులు పాల్గొన్నారు.

