
భూమా అఖిల ప్రియాకు సవాల్ :విజయ డైరీ చైర్మన్
కర్నూలు న్యూస్ వెలుగు : విజయ డైరీ ఆస్తుల్లో ఒక్క సెంట్ నాపేరుతో ఉన్నట్టు రుజువు చేస్తే నాకు ఉన్న మొత్తం ఆస్తినీ రాస్తానని చైర్మన్ ఎస్.వి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.ఆయన కర్నూలు లోని విజయ పాల డైరీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపణలను కండించారు. వారు చేసిన “ఆ ఆరోపణలకు రుజువు చేయకుంటే అఖిల ప్రియ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా?” అని సూటిగా ప్రశ్నించారు.విజయ డైరీ ఎండిపై కేసులు పెట్టడం సమంజసమా? అని మండిపడ్డారు. “నంద్యాల విజయ డైరీ రైతుల సంస్థ అని ఎవరికి వ్యక్తిగతం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.2016–19 మధ్య విజయ డైరీ పాలతో పాటు జగత్ పాలు కూడా అమ్మేవాళ్లమని తెలిపారు. “180 మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఏ ఒక్కరి నుంచీ ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువైతే నేను రాజీనామా చేస్తా” అని ప్రకటించారు. 50 లక్షల ఆదాయంతో నడిచిన సంస్థ ఇప్పుడు 10 కోట్ల ఆదాయంతో ముందుకు వెళ్తోందని వివరించారు. “కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కేసులు పెడుతున్నారు. బెయిల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది” అని అసహనం వ్యక్తం చేశారు.“చైర్మన్‌గా జగన్ మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానన్ని వెనక్కి వెళ్లను” అని చెప్పారు.

