కలసికట్టుగా పనిచేస్తాం పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయం లేదు : బాబురావు

కలసికట్టుగా పనిచేస్తాం పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయం లేదు : బాబురావు

కర్నూలు న్యూస్ వెలుగు : పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తామని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు తెలిపారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప, ద్వేషాలు మాత్రం నాకు లేవని స్పస్టం చేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ కి తనకు మద్య ఎలాంటి అభిప్రాయ బేదం లేదని మేము కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తామని వెల్లడించారు. తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తి వేసినందుకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కి, ఎపిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి కి ధన్యవాదము తెలిపారు. ప్రతి పక్షనేత రాహుల్ గాంధీ కి నా ప్రత్యేక వందనాలు తెలిపారు. రాహుల్ గాంధీ అడుగు జాడలలో మేము నడుస్తాము. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామని , ఎన్ని ఒరిదుడుకులు వచ్చిన ఎదుర్కుంటమన్నారు . జిల్లాలోని ప్రతి నియోజకవర్గం లో మా జండా ఎగరవేస్తాం గతంలో నేను జిల్లా అధ్యక్షులు గా పార్టీకి పని చేసింది 11నెలలు మాత్రమే అయిన నా శక్తికి మించి పని చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మాకు ఎలాంటి అడ్డంకులు వచ్చిన కూడా మేము కచ్చితంగా పోరాడతామని , ప్రతి ఒక లీడర్ కూడా గెలిచేలా ప్రణాళికలు రచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా, ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, డిసిసి మాజీ సెక్రెటరీ బి సుబ్రహ్మణ్యం, ఎస్సీ సెల్ సిటీ అధ్యక్షులు డబ్ల్యు సత్యరాజు, ఐఎన్టియుసి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, ఐదవ వార్డు ఇన్చార్జి హుస్సేన్ భాష మొదలగువారు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!