కర్నూలు నూతన డిసిసి అధ్యక్షుల కొరకు దరఖాస్తు ఆహ్వానం

కర్నూలు నూతన డిసిసి అధ్యక్షుల కొరకు దరఖాస్తు ఆహ్వానం

కర్నూలు న్యూస్ వెలుగు :  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లేనందు వల్ల కొత్త డిసిసి అధ్యక్షుడి కొరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు ఏఐసిసి కార్యదర్శి శ్రీ హెచ్ సి యోగేష్ గారు తెలియజేశారు. శనివారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసిసి అబ్జర్వర్లు శ్రీ సాకే శంకర్ గారు మరియు సొంటి నాగరాజు గారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగేష్ గారు మాట్లాడుతూ కొత్త డీసీసీని ఎన్నుకొనుటకు కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీలో అర్హులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి నాయకులను కలుస్తాము. ప్రతి ఒక్క కాంగ్రెస్ మెంబర్ను, గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులను కలుస్తాము. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులను అనుబంధ సంఘాల నాయకులను కలుస్తామను. పీసీసీ డిసిసి లో పనిచేసిన పాతవారిని కలుస్తామనీ ఐదవ తేదీ లోపు డిసిసి అధ్యక్ష పదవి ఆశించి అభ్యర్థులకు ఎంతమంది బలపరుస్తున్నారు. ఆ నివేదికను అధిష్టానానికి పంపిస్తామని ఎక్కడెక్కడ డిసిసిలు లేని చోట పర్యవేక్షకులు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుని నివేదికను అధిష్టానానికి తెలియజేస్తారని. ఈరోజు కర్నూలు డిసిసి కార్యాలయంలో కోఆర్డినేటర్లను అనుబంధ సంఘాల అధ్యక్షులను మండల కాంగ్రెస్ అధ్యక్షులను కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నాము. రేపటి నుండి నియోజకవర్గాల పర్యటన ఉంటుందనీ ప్రతిరోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటిస్తాము. ప్రతిరోజు నివేదిక కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని నాలుగు రోజులలో జిల్లాలోని నియోజకవర్గాలన్నీ పర్యటిస్తాము. 29 వ తేదీ వరకు కర్నూల్ డిసిసి అధ్యక్షుడి నియామకానికి అందరి అభిప్రాయాల మేరకు అధిష్టానం కొత్త డిసిసి నియామక ప్రక్రియ చేపడుతుందని మా పర్యటన వివరాలు ఈ విధంగా ఉంటాయని 26వ తేదీ ఉదయం 10 గంటలకు కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు టౌన్ లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. 27వ తేదీ ఉదయం 10 గంటలకు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశం, సాయంకాలం నాలుగు గంటలకు ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. సాయంకాలం నాలుగు గంటలకు ఎమ్మిగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. 29వ తేదీ ఉదయం 10 గంటలకు మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. సాయంకాలం నాలుగు గంటలకు కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఉంటుందని యోగేష్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు, మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జి నాగ మధు యాదవ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎం కాశీం వలి, బి క్రాంతి నాయుడు, అనంతరత్నం మాదిగ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న, ఓబిసి సెల్ చైర్మన్ డివి సాంబశివుడు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి ఎన్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు జి వీరేష్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృ,ష్ణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై మారుతీ రావు మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగిడాల ఆమానుల, డాక్టర్ సుభాన్ ఏసీ సెల్ మాజీ మాజీ అధ్యక్షులు ఈ లాజరస్ డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శిలు దిలీప్ డొక, సయ్యద్ నవీద్ రియాజుద్దీన్ వార్డు ఇన్చార్జీలు ఎన్ సుంకన్న కాంగ్రెస్ నాయకులు బి సుబ్రహ్మణ్యం డబ్ల్యూ సత్యరాజు అబ్దుల్ హై షేక్ మాలి భాష, సాయినాథ్, దేవి శెట్టి వీరేష్ శ్రీనిధ్ రాయల్, జాన్ సదానందం యు శేషయ్య, హుస్సేన్ భాష. మహిళా కాంగ్రెస్ బి హైమావతి, ఏ లలితమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక: – కోడుమూరు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు కోడుమూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ ఆధ్వర్యంలో కేంద్ర కాంగ్రెస్ కేంద్ర కమిటీ అబ్జర్వర్ శ్రీ హెచ్ సి యోగేష్ గారి మరియు ఏపీసిసి అబ్జర్వర్లు సాకేశంకర్ గారి సొంటి నాగరాజు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జే బండి రాజు ,హలన్ కుమార్, డి శేషు, బి నాగేష్, మారెప్ప, ఎం బాబు, లాసెటరన్స్, సల్మాన్, దానియేలు, ఏసేపు జమన్న మొదలు గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!