
విశ్రాంతి సదన్ నిర్మాణ నమూనా విడుదల
కర్నూలు న్యూస్ వెలుగు : ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో రోగుల అటెండెంట్ల కోసం నిర్మించబోయే ‘విశ్రాంతి సదన్’ పనులపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు రూ.14.6 కోట్ల వ్యయంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ CSR నిధుల సహకారంతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సమీపంలో NBCC (National Buildings Construction Corporation) ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఈ ఆధునిక ‘విశ్రాంతి సదన్’ మాస్టర్ ప్లాన్ నమూనా, డిజైన్లను పవర్ గ్రిడ్ అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు.
ప్రాజెక్ట్ ప్రధాన విశేషాలు: G+3 అంతస్తుల ఆధునిక వసతి భవనం – ఆర్కిటెక్ట్స్ రూపకల్పన మొత్తం 150 పడకల సామర్థ్యం – సింగిల్ రూములు, ట్విన్ రూములు, డార్మిటరీలు, మహిళా వసతి గదులు దూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల బంధువులకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వసతి, ప్రతి అంతస్తులో సౌకర్యవంతమైన గదుల విభజన, సదుపాయాలు ఉంటుంది అని అన్నారు.ఈ ప్రాజెక్టు 18 నెలలలో పూర్తవుతుందని అన్నారు. GGH పరిసరాల్లో వసతి సమస్యను పరిష్కరించే ప్రధాన ప్రాజెక్టుగా ఈ విశ్రాంతి సదన్ నిలుస్తుందని, పవర్ గ్రిడ్ CSR చొరవతో కర్నూలుకు మరో ప్రాధాన్యత గల వసతి సేవ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి సింధు సుబ్రహ్మణ్యం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్, శ్రీనివాస్ మూర్తి, అబ్దుల్ రహీమ్ (Dy. General Manager – Engineering, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NBCC), బిల్డింగ్ ఆర్కిటెక్ట్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

