ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు

ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు

కర్నూలు న్యూస్ వెలుగు : ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు విభాగాలను ఆకస్మికంగా పరిశీలించారు జనరల్ మెడిసిన్, ఆర్థో, జనరల్ సర్జరీ, ఇఎన్టీ, సైకియాట్రి, సూపర్ స్పెషాలిటీ, గైనిక్, పీడియాట్రిక్, తదితర ఓపి విభాగాలను తనిఖీ చేసినట్లు సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఓపి విభాగాలలో ఈ హాస్పిటల్ ఎంట్రీలు, ఓపి రికార్డులు, యూహెచ్‌ఐడీ నంబర్ నమోదు తప్పనిసరి అని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు.  EHR ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అన్ని ఓపీ విభాగాలలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది అని పరిశీలించారు అనంతరం ఓపీ విభాగాలలో అందరూ తప్పకుండా పేషెంట్ కు సంబంధించిన అన్ని మాడ్యూల్ వివరాలు నమోదు అయ్యే విధంగా చూసుకోవాలి వైద్యులకు ఆదేశించారు. ఆర్థో విభాగంలో పేషంట్ కు సంబంధించిన రిజిస్టర్ సక్రమంగా మెయింటెన్ చేయాలని వైద్యులకు ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటించాలి, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరిండెంట్లు డా.లక్ష్మీబాయి, డా.నాగేశ్వరరావు, CSRMO డా. పద్మజ, డిప్యూటీ CSRMO, డాక్టర్ పద్మజ, RMO డా. వెంకటరమణ, అసోసియేట్ ప్రొఫెసర్, డా.శివబాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. కిరణ్ కుమార్, ARMOS, డాక్టర్ క్లింటన్, డాక్టర్ సునీల్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!