
రైతును మరోసారి మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైఎస్ షర్మిల
అమరావతి న్యూస్ వెలుగు : కూటమి ప్రభుత్వం పై వైఎస్ షర్మిల మండిపడ్డారు. సాగుకు పంచ సూత్రాలు కాదు..కూటమి ప్రభుత్వం చేసింది పంచ మోసాలని ఆమె అన్నారు . చంద్రబాబు పంచ సూత్ర సంక్షేమం బూటకమని , 17 నెలలుగా వ్యవసాయాన్ని గాలికొదిలేశారన్నారు. రైతన్నలను అప్పుల పాలు చేసి చోద్యం చూశారన్నారు. సాగుకు సమాధి కట్టి.. అన్నదాతలకు మేలుకోసం పంచసూత్ర ప్రణాళిక అనేందుకు, రైతన్నా మీకోసం అని వెళ్లేందుకు, విస్తృత ప్రచారం కోసం , డబ్బా కొట్టేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు . కూటమి ప్రభుత్వం 17 నెలల పంచ మోసాలు ఈవేనాని వాటిలో .ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారని, ఏ పంటకు మద్దతుధర కల్పించకుండా రైతుని మోసం చేశారన్నారు , అన్నదాత సుఖీభవ కింద సగం మంది రైతులకు పంగనామాలు పెట్టారనీ ఆరోపించారు. ఇతర సబ్సిడీ పథకాలకు స్వస్థి చెప్పారన్నారు. టమాటా,ఉల్లి,అరటి లాంటి పంటలు రూ.1 రూపాయికి పడిపోయినా ధరల స్థిరీకరణ నిధి పెట్టకుండా మంగళం పాడారనీ దుయ్యబట్టారు . .చివరకు ఎరువులు, విత్తనాలు కూడా రైతుకు ఇవ్వకుండా అప్పుల బాధతో రైతన్నలకు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రైతుని కూటమి ప్రభుత్వం తీసుకొచిన్నట్లు ఆమె తెలిపారు.

