ఫర్ మెన్ డిగ్రీ కళశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 ఫర్ మెన్ డిగ్రీ కళశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు బి. క్యాంపు నందు గల  ఫర్ మెన్ డిగ్రీ కాలేజీ వారు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  హాజరయ్యారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేకతను, వరకట్న నిరోధక చట్టాలు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి విద్యార్థులకు వివరించారు.సీనియర్ న్యాయవాది వై. జయరాజు మాట్లడుతూ రాజ్యాంగ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. అనంతరం కాలేజీ నందు రాజ్యాంగ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం గురించి నిర్వహించిన వ్యాసరచన పోటీల నందు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జడ్జి  చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సదస్సులో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ జె. హేమంత్ మరియు సత్యనారాయణ, లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు,న్యాయవాది రవికుమార్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ త్రినాధ్ కుమార్, ఈగల్ టీమ్ సి. ఐ. సృజన్ కుమార్, మెంబర్ మాసూమ్ వలి, అధ్యాపకులు డాక్టర్ ఫక్రునిషా బేగం, డాక్టర్ వింధ్యవాసినీ దేవి, నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!