తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ను సిద్దం చేయండి

తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ను సిద్దం చేయండి

తెలంగాణ న్యూస్ వెలుగు : అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్, పాలసీ డాక్యుమెంట్‌ కనిపించాలని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ , రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ గా మూడు ప్రాంతాలుగా విభజించుకోవాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ది, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్దమౌతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్దే టార్గెట్‌గా రానున్న 22 ఏంఢ్ల కార్యాచరణను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సుమ్మీట్ పై ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!