
క్రమశిక్షణ తప్పనిసరి: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
పుట్టపర్తి న్యూస్ వెలుగు : ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే పోలీస్ శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతారని ఆ దిశగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, చేసే విధంగా అలవాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సూచించారు.
జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని స్థానిక పోలీసు పరేడ్ మైదానం నందు శుక్రవారం ఉదయం ఏ.ఆర్ సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగర్డ్ సిబ్బందితో నిర్వహించిన పరేడ్ ను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ…

పరేడ్ అనేది క్రమ శిక్షణకు నిదర్శనం, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో పరేడ్ కి ఎంతో అవస్యకత ఉందన్నారు., సిబ్బంది విధి నిర్వహణలో తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటారని, పరేడ్ కార్యక్రమం సిబ్బంది అందరిని సమైక్యంగా చేస్తూ సమిష్టి విధి నిర్వహణకు తోడ్పడుతుందని, సిబ్బంది పరేడ్ లో పాల్గొనేలా అలవర్చుకోవాలన్నారు.
ఎస్కార్ట్ పరంగా విధులు నిర్వహించే సిబ్బంది ఎటువంటి పరిస్థితులలో కూడా ముద్దాయిలతో జతకట్టకూడదని, ఎస్కార్ట్ విధులలో నిబద్ధతగా వ్యవహరించి విధులు నిర్వర్తించాలన్నారు.
జిల్లా పోలీసులు అందరూ ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి అని, ఆరోగ్యం మెరుగదల కోసం ప్రతీరోజూ గ్రౌండు, ప్రాక్టీస్ మరవద్దు ఎస్పీ సూచించారు.మీ ఆరోగ్యం బాగున్నప్పుడే మీకుటుంబం కూడా బాగుంటుందని, సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండి తమ కర్తవ్యాన్ని, సమర్థవంతంగా నిర్వహించినప్పుడే సమాజం కూడా శాంతియుతంగా ఉంటుందని తెలియజేసారు.
సిబ్బంది కి ఏ కష్టం వచ్చినా,విధుల్లో లేదా ఇతర విషయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు. సిబ్బంది సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని, సిబ్బందికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎస్పీ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ ఐ లు రవికుమార్, వలి , మహేష్ అర్ఎస్ఐలు, వీరన్న, ప్రదీప్ సింగ్, ప్రసాద్ ,ఇతర ఏ ఆర్ సిబ్బంది, హోంగార్డు లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పాల్గొన్నారు.

